Header Banner

అయ్యో.. మూడు దేశాలు అల్లకల్లోలం.. కరెంట్ లేక వీధుల్లోకి జనం.. విమానాలు, రైళ్లు ఆగిపోయాయి!

  Tue Apr 29, 2025 17:38        World

మూడు దేశాలు అల్లకల్లోలం అయ్యాయి.. ఏం జరుగుతుందో తెలియక జనం వీధుల్లోకి వచ్చారు. రైళ్లు ఆగిపోయాయి.. విమానాలు సర్వీసులు బ్రేక్ అయ్యాయి. బస్సులు నిలిచిపోయాయి. మూడు దేశాల్లోనూ కరెంట్ లేదు.. దీంతో మొత్తం వ్యవస్థలు అన్నీ కుప్పకూలాయి. స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్ దేశాల్లో పరిస్థితి ఇది. 2025, ఏప్రిల్ 28వ తేదీ ఉదయం ఈ పరిస్థితి తలెత్తింది. స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్ దేశాల్లో విద్యుత్ వ్యవస్థలు కుప్పకూలిపోవటంతో ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో జనం గందరగోళానికి గురయ్యారు. అసలే.. డిజిటల్ యుగం... ఏం కావాలన్నా చేతి మునివేళ్లతో స్క్రీన్ మీద టచ్ చేస్తే చాలు క్షణాల్లో జరిగిపోయే పరిస్థితి ఉన్న రోజుల్లో కరెంటు లేకపోతే.. ఎంత గందరగోళం క్రియేట్ అవుతుందో ఈ మూడు దేశాల్లో పరిస్థితి చుస్తే అర్థమవుతుంది.

 

ఇది కూడా చదవండి: సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

సోమవారం (ఏప్రిల్ 28 )స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్ దేశాల్లో కరెంటు కట్ అవ్వడంతో ఆయా దేశ రాజధానులు స్తంభించిపోయాయి. మూడు దేశాల్లో ఉన్న సుమారు 50 మిలియన్ల మంది ఏం జరుగుతుందో తెలియక గందరగోళానికి గురయ్యారు. పవర్ కట్ కారణంగా ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా ఆగిపోవడంతో ఎక్కడిక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది. మెట్రో రైళ్లు కూడా ఆగిపోవడంతో జనం తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఫోన్ లైన్స్ కూడా పనిచేయకపోవడంతో ఏం జరుగుతుందో కూడా తెలీని పరిస్థితి నెలకొంది. ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యి జనం విమానాశ్రయాలకు పరిమితం అయ్యారు. పవర్ కట్ కి కారణం ఏంటనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. డొమెస్టిక్ మీడియా ప్రకారం.. యూరోపియన్ ఎలక్ట్రిక్ గ్రిడ్ లో సమస్యలే పవర్ కట్ కి కారణమని తెలుస్తోంది. సౌత్ వెస్ట్ ఫ్రాన్స్ లో అగ్నిప్రమాదం వల్ల హై వోల్టేజ్ పవర్ లైన్ దెబ్బతినడం కూడా కారణమని తెలుస్తోంది.


ఇది కూడా చదవండి: పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.8 లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

 

ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..

 

మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!

 

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #ViralNews #CurrentCut #MajorPowerProblem #France